- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మారేది లేదు… కేసీఆర్ తోనే ఉంటా : మాజీ ఎమ్మెల్యే
దిశ,మద్దూరు, కొత్తపల్లి: తన సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన పనులు పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ నెల 15 న మాజీ మంత్రి హరీష్ రావు నిర్వహించే సమావేశానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిగా తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఉసెనప్ప, శివకుమార్ భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రఫీ, శివశంకర్ తో పాటు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.