Collectorate : జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు..ఎందుకంటే..?

by Naveena |
Collectorate : జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు..ఎందుకంటే..?
X

దిశ,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఆరుకాలం శ్రమించి పండిస్తున్న రైతుల పంట పొలాల్లో ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటుకు యోచిస్తుండడంతో.. కాయ కష్టం చేసుకొని జీవనాధారం చేసుకుంటున్న రైతులు, తమ భూములను కాపాడుకునేందుకు ఆందోళన బాట పట్టారు. రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్టు 30 ఎకరాలలో నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని రైతులు పెద్ద ఎత్తున ముట్టడించి ,ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే Collectorateనిలిపివేయాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,పలు ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేటు ముందు పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఏర్పాటు వల్ల అనేక గ్రామాలలోని రైతుల పంట పొలాలు దెబ్బ తినడంతో పాటు తుంగభద్ర, ఆర్డీఎస్ నీరు కలుషితమై సాగు,తాగునీరు కలుషిత మవ్వడమే కాకుండా..ప్రజలు ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభిప్రాయం తీసుకోకుండా గాయత్రి ఇథనాల్ ప్రాజెక్టుకు కరెంటుతో పాటు.. నీటీ కేటాయింపులు జరగడం ఎంతవరకు సబబని రైతులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపి మా గ్రామంలోని భూములు కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed