- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
national highway : వేగం పై 'స్పీడ్ గన్' గురి..
జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణ కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మద్యం సేవించి, పరిమితికి మించి వేగంగా నడిపినా, యూటర్న్ వద్ద, రోడ్డు క్రాసింగ్ వద్ద 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడు నడిపినా నేరమే. నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసులు, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మినహా మిగతా సమయాల్లో ఫైన్లు పడేవి కావు. దీంతో వాహనచోదకులు తమ వాహనాలను వేగంగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి పొడవునా పలుచోట్ల ఘోర ప్రమాదాలు జరగడంతోపాటు, ప్రమాదాలకు కారణమైన వాహన చోదకులు పలు సందర్భాల్లో తప్పించుకున్నారు. దీనికి తోడు అక్కడక్కడ దొంగతనాలు, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి పై వాహనాల వేగాన్ని, నేరాల నియంత్రణకు పోలీసులు రహస్యంగా స్పీడ్ గన్నులు ఎక్కుపెడుతున్నారు. జాతీయ రహదారి పొడవునా సీసీ కెమెరాలు ఒకవైపు ఉన్నప్పటికీ మరోవైపు పోలీసులు వారి పోలీస్ స్టేషన్లో పరిధిలో కనిపించకుండగా కూర్చొని స్పీడుపై గన్నులు గురి పెడుతున్నారు. నిర్దేశిత వేగం కన్నా ఎక్కువగా వాహనాలు వెళ్తే పిడి గన్ వెంటనే ఫైన్ వేస్తూ ఆ సమాచారాన్ని వాహన యజమానులు లేదా వాహనచోదకులకు క్షణాల్లో చేరవేస్తోంది. దీంతో రూ.వేలల్లో ఫైన్లు పడుతున్నాయి.
దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో : జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణ కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మద్యం సేవించి, పరిమితికి మించి వేగంగా నడిపినా, యూటర్న్ వద్ద, రోడ్డు క్రాసింగ్ వద్ద 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ నడిపినా నేరమే. నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసులు, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మినహా మిగతా సమయాల్లో ఫైన్లు పడేవి కావు. దీంతో వాహనచోదకులు తమ వాహనాలను వేగంగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి పొడవునా పలుచోట్ల ఘోర ప్రమాదాలు జరగడంతో పాటు, ప్రమాదాలకు కారణమైన వాహన చోదకులు పలు సందర్భాల్లో తప్పించుకున్నారు. దీనికి తోడు అక్కడక్కడ దొంగతనాలు, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు అధికారులు అడపాదడపా చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. దీంతో ప్రమాదాలు, నేరాలు, ఇతర సంఘవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రోడ్డు పొడవునా నిఘా నేత్రాలు..
జాతీయ రహదారి పై చాలాచోట్ల సీసీ కెమెరాలను గతంలో ఏర్పాటు చేశారు. కానీ వాటిని పర్యవేక్షించకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. సీసీ కెమెరాలను పట్టిష్టంగా ఏర్పాటు చేసి నిర్వహించడంతో పాటు రోడ్డు నిబంధనలను అధిగమించే వారికి షాక్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వరకు పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పై 80 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వెళ్లినా, యూటర్న్, రోడ్డు క్రాసింగ్ వద్ద 30 నుండి 40 కిలోమీటర్ల స్పీడు కన్నా ఎక్కువగా వాహనాలను నడిపినా వాటి స్థాయిని బట్టి జరిమానాలు పడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు మొదలుకొని భారీ వాహనాల వరకు ఇదే పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే వాహనాల యజమానులకు క్షణాలలో ఫైన్లు పడుతూ సమాచారం చేరుతోంది. ప్రస్తుతం నిఘానేత్రాలు జడ్చర్ల నుంచి హైదరాబాద్ వరకు ఉన్నాయి.
గమనించని వానచోదకులు..
నిబంధనలను పాటించాలని రోడ్డు వెంబడి సూచనలు, సూచికలు ఉన్నప్పటికీ నిఘా నేత్రాలు లేవు కదా అని వాహనచోదకులు తమ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా వేగంతో వెళ్తున్నారు. ఫైన్లు పడే అంశాన్ని గురించి చాలామందికి తెలియకపోవడంతో వాహనచోదకుల జేబులు గుల్ల అవుతున్నాయి. అధికారులు ఈ విషయం పై విస్తృత ప్రచారం కల్పించవలసిన అవసరం ఉందని పలువురు వాహనచోదకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణ కోసమే.. వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్
జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణ, దొంగతనాలు, అక్రమంగా పశువుల తరలింపు ఇతర నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల నుంచి బాలానగర్ పరిధి వరకు ఉన్నాయి. మిగతా జిల్లాల్లోనూ ఇప్పుడు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వాహనాల వేగ నియంత్రణ కోసం పోలీసులు కొన్నిచోట్ల కనిపించకుండా ఏర్పాటు చేసిన స్పీడ్ గన్‌తో పరిశీలిస్తున్నాం. కొన్నిచోట్ల సీసీ కెమెరాల్లో చేసిన ఏర్పాట్లతో ఫైన్లు కూడా పడుతున్నాయి. వాహనచోదకులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని తమ వాహనాలను సురక్షితంగా నడపాలి.