- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వినూత్న దొంగతనం.. పోలీసులే షాక్
దిశ ,ఉండవెల్లి : కొందరు అక్రమార్కులు బంగారం,నగదు డబ్బులను తరలించడంలో కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఆ దారులు ఎలా ఉన్నాయంటే పోలీసులే షాక్ తింటూ అవాక్కయ్యే విధంగా ఉన్నాయి. అందుకు నిదర్శనం తెలంగాణ -ఆంధ్ర అంతరాష్ట్ర సరిహద్దు కర్నూలు శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద జరిగిన సంఘటన.
స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ( సెబ్) సీఐ మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దు ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తమిళనాడు, కోయంబత్తూరు వెళ్తున్న స్వామి అయ్యప్ప ట్రావెల్ బస్సు (ఎన్ఎల్ 01బి 1149 )ను పరిశీలించారు. అందులో ప్రయాణిస్తున్న దేవరాజు, సెల్వరాజ్, కుమార వేలు, మురుగేశన్, వెంకటేష్ బ్యాగులలో సుమారు 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లను అలాగే స్లీపర్ సీట్ల కింద రూ. 90 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. అందులో వెంకటేష్ ఏకంగా వినూత్న రీతిలో అంగి లోపల ప్రత్యేక జాకెట్ లో బంగారం దాచాడు. అందుకు సంబంధించిన వీరందరిని పోలీసులు విచారించగా హైదరాబాద్‌లో వివిధ జ్యువెలరీ షాప్‌ల నుంచి ముడి బంగారు, వెండి తీసుకుని తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆభరణాలు తయారు చేసుకుని తిరిగి వాటిని హైదరాబాద్ జ్యువెలరీ షాప్ కి అప్పగిస్తామని అందుకు మేకింగ్ ఛార్జ్ ఇస్తారని వారు పోలీసులకు తెలిపారు. వీటి విలువ రూ 5.4 కోట్లు ఉంటుందని అంచనా. పట్టుబడిన నగదు ,బంగారు, వెండి కి సంబంధించిన ఏలాంటి ధ్రువ పత్రాలు లేనందున విచారణ నిమిత్తం కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కి తరలించినట్లు సెబ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై ప్రవీణ్ కుమార్,ఖాజా,సుంకన్న, సుందర్,విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.