మంత్రి బట్టికి ఎమ్మెల్యే వినతిపత్రం..

by Sumithra |   ( Updated:2024-12-17 12:14:24.0  )
మంత్రి బట్టికి ఎమ్మెల్యే వినతిపత్రం..
X

దిశ, మక్తల్ : కోతలు లేని విద్యుత్ పనులకు నిధులు ఇవ్వాలని మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వినతిపత్రం సమర్పించారు. మక్తల్ నియోజకవర్గం కేంద్రంతో పాటు మక్తల్ , అమరచింత, ఆత్మకూరు మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా కరెంటు సరఫరా కోసం పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు నియోజకవర్గంలో రైతులకు విద్యుత్ లైన్ వైర్లు, కరెంటు స్తంభాల ఎర్పాటుకై దాదాపుగా 19కోట్ల బడ్జెట్ కేటాయించాలని, మక్తల్ టౌన్ లో ప్రత్యేకంగా విద్యుత్ అంతరాయం లేకుండా టౌన్ 3 ఫీడర్ ల మంజూరు కొరకు నిధులు అవసరమని, విద్యుత్ అంతరాయం కలగకుండా సామాన్య ప్రజలకు, యాసంగి సాగుకు రైతులు సిద్దమౌతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించి నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇవ్వడంతో ఎమ్మెల్యే సమాచారం అందించారు.

Advertisement

Next Story