మంత్రి సత్యవతి పర్యటనకు ఏర్పాట్లు చేయండి : జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

by Sumithra |
మంత్రి సత్యవతి పర్యటనకు ఏర్పాట్లు చేయండి : జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ నెల 15న మన్ననూర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పర్యటన సన్నద్ధతపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

మే 15న మధ్యాహ్నం మన్నానూర్ చేరుకొని 16న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు, లబ్దిదారులకు ఇవ్వాల్సిన యూనిట్లు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. లబ్దిదారులకు సమాచారం ఇచ్చి యూనిట్ల గ్రౌండింగ్ స్థలికి తీసుకురావాలన్నారు. సభాస్థలి, మైక్ సిస్టం, తాగునీరు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story