Balakrishna: బాలకృష్ణ సెట్‌లో అలా చేస్తారు.. ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |
Balakrishna: బాలకృష్ణ సెట్‌లో అలా చేస్తారు.. ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) చిత్రంతో అలరించనున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో రాబోతుండగా.. ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా, ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇందులో నేను కావేరి(Kaveri) క్యారెక్టర్‌లో నటించాను.ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.

ఈ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది. బాలకృష్ణ గారికి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తనలో తాను స్ఫూర్తి నింపుకోవడమే కాకుండా, ఇతరులలోనూ ఆ స్ఫూర్తి నింపుతూ ఉంటారు. బాలకృష్ణ(Balakrishna) గారితో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. అయితే నా పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ బాలకృష్ణ(Balakrishna) గారి సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆయనతో కలిసి నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story