- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Stalin: యూజీసీ ముసాయిదా సమాఖ్య విధానంపై దాడి.. తమిళనాడు సీఎం స్టాలిన్
దిశ, నేషనల్ బ్యూరో: వైస్ చాన్స్‌లర్ల నియామకానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల విడుదల చేసిన ముసాయిదా నిబంధనలను సమాఖ్య విధానంపై దాడిగానే పరిగణిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) అన్నారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీసీ ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజా రూల్స్ తమిళనాడు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. విద్యా వ్యవస్థను చెడగొట్టేందుకే నూతన ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. నీట్ పరీక్ష వల్ల సోదరి అనితను కోల్పోయామని, ఆ ఎగ్జామ్ మొత్తం అవకతవకలతో నిండి పోయిందని మండిపడ్డారు. ‘యూజీసీ ముసాయిదాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము. ఇష్టారాజ్యంగా వీసీలను నియమించేందుకు గవర్నర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వడం సరికాదు. ఇది సొంత వనరులతో యూనివర్సిటీలను నిర్మించుకున్న రాష్ట్రాల హక్కులను కాలరాసే ప్రయత్నం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏఐఏడీఎంకే, బీజేపీ మిత్రపక్షం పీఎంకే సహా ఇతర రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి.