Srivari Darshan: తిరుమలలో నవ్వులు పూయించిన బ్రహ్మానందం

by srinivas |
Srivari Darshan: తిరుమలలో నవ్వులు పూయించిన బ్రహ్మానందం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని సినీ నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఈ సాయంత్రం తిరుమల వెళ్లిన ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో బ్రహ్మానందాన్ని ఆహ్వానించిన టీటీడీ అధికారులు.. శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. వెంకటేశ్వరస్వామి దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో బ్రహ్మానందం తనదైన స్టైల్లో నవ్వులు పూయించారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మానందం మధ్య హాస్యంగా సమాధానాలు ఇచ్చారు.

రిపోర్టర్, బ్రహ్మానందం మధ్య జరిగిన సంభాషణ

‘రిపోర్టర్: ఒక్క సెకన్ సార్

బ్రహ్మానందం: హలో బ్రో.. ఒక్క సెకన్ కాదయ్య.. ఒక నిమిషం

రిపోర్టర్: ఏమో సార్ నాకు తెలుగు రాదు

బ్రహ్మానందం: తెలుగు రాదా.?.. ఓ జస్ట్ వన్ మినిట్ మ్యాన్

రిపోర్టర్: సార్ ఫొటో ఇవ్వండి

బ్రహ్మానందం: తీసుకుంటున్నావ్ కదయ్యా..?.. ఒక ఫొటో అంటే ఏం ఇయ్యమంటావ్..?.’ అంటూ ఆయన సందడి చేశారు.


Advertisement

Next Story