- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ నీటి దుర్వినియోగంపై పోలేపల్లిలో లోకాయుక్త బృందం విచారణ..
దిశ, జడ్చర్ల: వ్యవసాయ బోరు మోటార్ల నుండి పరిశ్రమలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తుండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు లోకాయుక్త బృందం పరిశీలన చేపట్టింది. దీంతో అధికారుల తీరుపై లోకాయుక్త బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్చర్ల మండలం పోలేపల్లి పారిశ్రామికవాడ సమీపంలో వ్యవసాయ పంట పొలాల బోరు మోటార్ల నుండి ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు నీటిని తరలిస్తుండడంతో ఇటీవల స్థానికులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ రంగానికి నీటిని వాడాల్సి ఉన్నా ప్రత్యేకంగా పరిశ్రమలకు నీటిని అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు స్పందించిన లోకాయుక్త బృందం ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ మ్యాక్తు కోశాయ్, ఎస్సై శివ ఏఎస్సై గాల్ రెడ్డి మంగళవారం పోలేపల్లి సమీప వ్యవసాయ పంట పొలాలను సందర్శించింది. దీంతో ఒకే రైతుకు చెందిన నాలుగు, ఐదు బోరు మోటార్ల ద్వారా ప్రత్యేకంగా పైపులైన్లు వేసి పరిశ్రమలకు నేరుగా నీటిని తరలిస్తున్నారని, అలాగే మరికొన్ని వ్యవసాయ బోరు మోటార్ల ద్వారా ఫామ్ ఫండ్ ను ఏర్పాటు చేయడమే గాక వాటిలో నీటిని నిల్వ చేసి ట్యాంకర్లు నింపి పరిశ్రమలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు కూడా నీటిని విక్రయిస్తుండడంతో పరిశ్రమలను కూడా బృందం సందర్శించింది.
దీంతో విస్తు పోయే నిజాలు లోకాయుక్త బృందం వెలుగు చూసింది. వ్యవసాయం పేరుతో విద్యుత్ కనెక్షన్లు తీసుకొని పరిశ్రమలకు నీటిని అమ్ముకుంటున్నారని దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొడుతున్నారని అధికారులు గుర్తించారు. అధికారుల విచారణ సమయ ఫంఫండ్ సంపులో నుండి నీటిని నింపుతున్న ట్యాంకర్ ను లోకాయుక్త అధికారులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మరోవైపు స్థానిక అధికారుల తీరుపై సంబంధిత లోకాయుక్త అధికారుల బృందం సీరియస్ అయింది. అన్నీ తెలిసిన అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు ఉన్నారని దీంతో విచ్చలవిడిగా వ్యవసాయ రంగానికి వాడాల్సిన నీటిని పరిశ్రమలకు ఇష్టానుసారంగా తరలిస్తున్నారని ఇలా సుమారు 35 కు పైగా బోర్ మోటార్ల నుండి 30కి పైగా ట్యాంకర్ల ద్వారా నిత్యం నీటిని తరలిస్తున్నారని అధికారుల బృందం తెలిపింది. పోలేపల్లి కి చెందిన మాజీ సర్పంచ్ తన ఇంటి సమీపంలో వ్యవసాయ పొలంలో బోరు మోటార్లు వేసి హేటిలో కంపెనీకి నేరుగా అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని అమ్ముకుంటున్న విషయాన్ని లోకాయుక్త అధికారులు గుర్తించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని స్థానిక తహసీల్దార్ బ్రహ్మం గౌడ్ కి పోలేపల్లి పారిశ్రామికవాడ సమీపంలో జరుగుతున్న నీటి దుర్వినియోగాన్ని వివరించారు. అందుకు సంబంధించిన పలు శాఖల అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. లోకాయుక్త బృందానికి మండల ఆర్ ఐ ఖదీర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.