- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మతం పేరుతో కించపరుస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్
దిశ, అచ్చంపేట: సామాజిక మాధ్యమాలే కేంద్రంగా సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించపరుస్తూ పోస్ట్ పెట్టిన అచ్చంపేట పట్టణానికి చెందిన కుల్కుందాకారి శివాజీ అనే అరెస్టు చేసినట్లు డీఎస్పీ పల్లె శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పై వ్యక్తి అచ్చంపేట పట్టణంలో మటన్ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడని తాను ఈ నెల 02 న సాయంకాలం ఆరు గంటల సమయంలో తన వాట్సాప్ గ్రూపు నందు మరో మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ చేశాడన్నారు. ఆ విషయం పై అచ్చంపేట పీఎస్ నందు ఫిర్యాదు అందగా ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని ఆ నిందితుడిని కోర్టు నందు హాజరు పరిచారన్నారు. కావున అచ్చంపేట ప్రజలరా సోషల్ మీడియాను దుర్వినియోగం చేయవద్దన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేసిన యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.