రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రసంగాలను నమ్మొద్దు.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి..

by Sumithra |
రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రసంగాలను నమ్మొద్దు.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి..
X

దిశ, వనపర్తి : ప్రభుత్వం పై రాజకీయ పార్టీ నాయకులు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలను పట్టించుకోకూడదని రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల లోకానికి సూచించినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు డైట్, కాస్మోటిక్ చార్జీల కాంగ్రెస్ ప్రభుత్వం 40 శాతం పెంచుతూ 1330 రూపాయల వరకు చార్జీలను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు మంచి చేశారని అన్నారు. విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా పటిష్టపరిచి నాణ్యమైన విద్యాబోధనతో పాటు క్రీడా రంగాన్ని సైతం బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్కిల్ యూనివర్సిటీని ఐటీఐలను, ఏటీసీలుగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుతో పాటు విద్యావ్యవస్థను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి యువజన సంఘాలు చొరవ చూపాలని, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడొద్దని కోరారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దని, విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed