- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలంపూర్ నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం.. రాయచూర్ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
దిశ, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో పలుచోట్ల మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయిజ పట్టణం సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో కర్ణాటకకు వెళ్లే రైచూర్ ప్రధాన రహదారిపై దాదాపు తెల్లవారుజామున నుండి 9 గంటల వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తుపత్రాల, మేడికొండ, పులికల్, చిన్న తాండ్రపాడు, వేణిసొంపురం, కేశవరం గ్రామాలకు రాకపోకలకు స్తంభించిపోయాయి. అటువైపు ఎవరు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా ఇటిక్యాల మండల పరిధిలోని సాతర్ల, వావిలాల, మానోపాడు మండల పరిధిలోని అమరవాయి, మానోపాడు, గోకులపాడు ఉండవెల్లి మండల పరిధిలోని కంచుపాడు గ్రామ సమీపంలో వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
వాగులు, వంకలు ఉన్న పరివాహక ప్రాంతాల్లో చాలాచోట్ల పంటలు వర్షపు నీటిలోని మునిగి ఉన్నాయి. ఎకరాకు 40 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. పంటలు ఎదిగే సమయంలో భారీ వర్షాలు వరుసగా కురువవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని కొంతమంది రైతులు వాపోతున్నారు. భారీ వర్షం కురిసి వాగులు ఉప్పొంగిన చోట పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షం ఎక్కడ కురిసింది.. ఈ గ్రామంలో ఈ వాగు ఉప్పొంగిందో తెలియని విధంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పొంగిపొర్లుతున్న వాగులను పరిశీలించి ప్రజలకు తాజా సమాచారంను మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు రైతులు కోరుతున్నారు.