ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలి

by Sridhar Babu |
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కొల్లంపల్లి, ధన్వాడలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కలెక్టర్ తనిఖీ చేశారు. కొల్లంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులకు సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వాలన్నారు.

అనంతరం ధన్వాడ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ఇంతవరకు ఎంతమంది రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చారని అడిగారు. వరి ధాన్యం కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.2,320, బీ గ్రేడ్ రూ.2,300 కు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని, మధ్య దళారీలను ఆశ్రయించవద్దని కలెక్టర్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed