- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
దిశ, హన్వాడ : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హన్వాడ మండలం లోని ఇబ్రహీంబాద్, హన్వాడ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం దగ్గర వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యెన్నం మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులను రుణ విముక్తులను చేశామని గుర్తు చేశారు. రైతులకు మద్దతు ధరను కల్పిస్తున్నామని, మొట్టమొదటి సారిగా సన్నాలకురూ. 500 బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని, చివరి గింజ వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసిన 48 గంటల లోపే రైతు అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దళారులను నమ్మి మోస పోరాదని ఆయన రైతులకు సూచించారు. అనంతరం హన్వాడ మండల కేంద్రంలో జరిగిన 'సమగ్ర కుటుంబ సర్వే' కార్యక్రమంలో పాల్గొని సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రజా అవసరాల పంపిణీ వ్యవస్థ ను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమగ్ర కుటుంబ సర్వే వల్ల అందరికీ మేలు జరుగుతుందని, మీ దగ్గరకు వచ్చే అధికారులకు ప్రజలంతా సహకరించి, వారు అడిగిన సమాచారాన్ని అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిఆర్డీఎ పిడి నర్సింహులు, తాహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపిడిఓ యశోద, ఎవో కిరణ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి.మహేందర్, సొసైటీ చైర్మన్ వెంకటయ్య, నాయకులు నవనీత, యాదిరెడ్డి, వెంకటయ్య, కేశవులు, గంగపురి, యండి కలీం, రాములు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.