ఆ మండల కేంద్రంలో ఆరు నెలలుగా మంచినీటి సమస్య..

by Sumithra |
ఆ మండల కేంద్రంలో ఆరు నెలలుగా మంచినీటి సమస్య..
X

దిశ, అచ్చంపేట : జిల్లాలోని పదర మండల కేంద్రంలో ఒకటో వార్డులో సుమారు ఆరు నెలల నుండి మంచినీటి సమస్యతో పాటు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వార్డుకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని పరిష్కరించాలని సంబంధించిన పంచాయతీ కార్యదర్శితో పాటు ఎంపీడీవో దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం చూపటం లేదని వారు మండిపడుతున్నారు. గురువారం పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలకు సమస్యలు విన్నవించేందుకు కార్యాలయం వద్దకు వెళ్లారు.

కానీ రెండు కార్యాలయాలు ఉదయం 10:30 గంటల వరకు తాళాలు వేసి ఉన్నాయి. అధికారులు ఇలా ఉంటే తమ సమస్య ఎవరికీ చెప్పుకోవాలని కాలనీవాసులు కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో గొల్లం ఎల్లయ్య, కడారి పర్వతాలు, బాలయ్య, మల్లయ్య, ఎక్స్ ఎంపీటీసీ సునీత శ్రీను, బొడ్డు శ్రీకాంత్, వెంకటయ్య, సారయ్య తదితరులు ఉన్నారు. పై విషయం పై ఎంపీడీవోతో పాటు పంచాయతీ కార్యదర్శిని ఫోను ద్వారా వివరణ కోరెందుకు ఎంత ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదు.

Advertisement

Next Story

Most Viewed