- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు..
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన లారీ క్లీనర్ బుర్ర రవీంద్ర (37), భార్య రజిని (వికలాంగురాలు) దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రవీంద్ర వృత్తిరీత్యా లారీ క్లీనర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలలుగా రవీంద్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం నిమిత్తం ఖమ్మంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె, లివర్, కిడ్నీలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి అని, మెరుగైన వైద్యానికి హైదరాబాద్ ఆసుపత్రిలో చేరవలసిందిగా సూచించారు.
ఆర్థిక పరిస్థితి సరిగా లేని రవీంద్ర కుటుంబం సరైన వైద్యం అందించలేక మదన పడుతుండటంతో గమనించిన స్థానిక గ్రామస్తులు ఆర్థిక సాయం కోసం దాతలను ఆశ్రయించారు. గ్రామస్తులు, 25 మంది సభ్యులు కలిగిన ఖమ్మం లకారం రన్నర్స్ తరపున బాధితుల కుటుంబానికి 31,500/- రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సహాయంతో రవీంద్రను మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించారు. వైద్య సేవల నిమిత్తం దాతలు ఆదుకోవాలని రవీంద్ర కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన దాతలు 7670912376. నెంబర్ కాల్ చేసి ఆర్థిక సహాయాన్ని అందించాలని రవీంద్ర వేడుకుంటున్నారు. రూ 31,500/- ఆర్థిక సహాయాన్ని అందించిన గ్రామస్తులకు, ఖమ్మం లకారం రన్నర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.