- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 ఏళ్ల చిన్నారికి నూతన జీవితాన్ని అందించిన మెడికవర్ వైద్యులు
దిశ, శేరిలింగంపల్లి : అరుదైన బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు మాదాపూర్ మెడికవర్ వైద్యులు. అత్తాపూర్ కు చెందిన అక్షర (12) పాఠశాలలోనే నిద్రపోవడం గమనించిన టీచర్లు.. మొదట చిన్నపాప అన్నం తినడం వల్ల నిద్రవస్తుందేమో అని అనుకున్నారు. కానీ అలా తరుచు నిద్రపోవడం గమనించిన టీచర్లు ఆమె తల్లిదండ్రులకు ఈ విషయాన్నీ తెలియచేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించమని సూచించారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పలు వైద్యులను సంప్రదించగా, అక్షరకు మెదడులో బ్లాస్టోమా అనే ట్యూమర్ ఉన్నట్టు తెలిపారు. ఇది బ్రెయిన్ స్టెమ్‌ను ఒత్తిడి చేస్తూ నరాలకు అతుక్కొని ఉన్నట్టు గుర్తించారు.
ట్యూమర్ స్థానం క్లిష్టంగా ఉండడం వల్ల ఆపరేషన్ లో చిన్నపోరాపాటు జరిగినా పక్షవాతం లేదా ప్రాణాపాయం వంటి సమస్యలు రావచ్చని, వయసురీత్యా చిన్న పాప అవ్వడంతో సర్జరీ చేయడానికి కూడా వైద్యులు ముందుకు రాలేక పోయారు. అటువంటి సమయంలో అక్షర కుటుంబం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డా. శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించారు. పాప పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆపరేషన్ చేసి ట్యూమర్ గడ్డని తొలగించి పాప ప్రాణాలను కాపాడారు. ట్యూమర్‌ను పూర్తిగా తొలగించగలిగారు కానీ ఆపరేషన్ తరువాత అక్షర హైడ్రోసెఫలస్ అనే సమస్యకు గురైంది, దీనిని సరిచేయడానికి వెంట్రికులోపెరిటోనియల్ (వీపీ) షంట్ కోసం రెండవ సర్జరీ చేయాల్సి వచ్చింది. క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, అక్షర మూడు నెలలపాటు కోమాలోకి వెళ్లింది.
ఈ కఠిన పరిస్థితుల్లో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయన బృందం నిరంతర చికిత్స అందించారు. అయితే అక్షర ఆకస్మాత్తుగా మేల్కొని తన తండ్రితో మాట్లాడింది. ఇది ఆమె కోలుకోవడంలో ముఖ్యమైన ఘట్టమైంది. ఆ తర్వాత తీసిన స్కాన్లు ఆమె పూర్తిగా కోలుకున్నదని నిర్ధారించాయి. అక్షరకు చికిత్స అందించిన అనంతరం డాక్టర్ మాట్లాడుతూ… అత్యంత క్లిష్టమైన ప్రదేశంలో చిన్న మెదడుకు ట్యూమర్ వ అతుక్కొని ఉండటం, సర్జరీ చాలా ఖచ్చితత్వంతో చేయడం వల్ల ప్రాణాలతో బయట పడింది అని అన్నారు. తమ కూతురి ప్రాణాలను కాపాడినందుకు అక్షర కుటుంబం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ నిత్య పాలపాటి, అనస్థీషియా లజిస్ట్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.