ప్రజారోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

by Sridhar Babu |
ప్రజారోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, చర్ల : ప్రజా ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు.. గురువారం చర్ల మండలంలో పర్యటించిన ఆయన సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా వైద్య శాఖ సహకారంతో మంజూరైన నూతన 108 సర్వీస్ అంబులెన్స్ ను భద్రాచలం ఐటీడీఏ పీఓతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వ సహకారంతో ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యాధికారులు దివ్యనైన నగేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది బాబూరావు, ఉమారాణి, శ్రీదేవి, తిరుపతమ్మ పాల్గొన్నారు.

Advertisement

Next Story