వైభవంగా విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు

by Naveena |
వైభవంగా విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు
X

దిశ, ఊట్కూర్ : మండల కేంద్రంలోని గోశాల ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పురోహితులు వేదమంత్రోచరణల మధ్య ప్రతిష్టాపన చేసి గణపతి, శివలింగం, నంది, నాగదేవతలు గోమాత నవగ్రహ విగ్రహాలకు ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పశ్చిమాద్రి విరక్త మఠం సిద్ధ లింగస్వామి, శ్రీ శక్తి పీఠం శాంతానంద్ స్వామి, బిజ్వార్ ఆదిత్య పరా శ్రీ స్వామి, ధర్మశాస్త్ర పీఠం శివానంద మాట్లాడుతూ..అలనాడు తండ్రి చెపితే రాముడు వనవాసానికి వెళ్ళాడు అని.. తమ్ముడు అయినా లక్ష్మణుడు రాముడితో పాటు వనవాసానికి వెళ్లారని.. భరతుడు రాముడి పాదరక్షకములతో పాలనను నడిపించాడని..కానీ నేటి ప్రపంచంలో అన్న, తమ్ముళ్లు మరణిస్తే ఎవరి ఆస్తి మనకు వస్తుందని అత్యాశకు వెళ్తున్నారని అది మంచితనం కాదన్నారు. దేవుళ్ళ విగ్రహాలు పెట్టడంతో పాటు వారిని ఆదర్శంగా జీవించాలన్నారు. ఆలయాలతో పాటు తల్లిదండ్రులను అన్నదమ్ములను ఒకరికొకరు గౌరవించుకోవాలన్నారు. మానవ జన్మతో ప్రతి ఒక్కరూ ముక్తి చెందాలన్నారు. హిందూ ధర్మరక్షణకు ప్రతి ఒక్కరూ నిలబడాలన్నారు. ఆలయంలో గోశాల ఏర్పాటు చేయాలని.. ప్రతి ఒక్కరూ గోవుల రక్షణకు పాటు పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల రాజకీయ నాయకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed