- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమార్కుల చిట్టాను ఆధారాలతో బయట పెడతా.. పొంగులేటి సంచలన ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 31లోపు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలనలో అప్లై చేయని వాళ్లు కూడా ఇందిరమ్మమ ఇళ్లలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చామన్నారు. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామన్నారు. ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్‌లో నమోదు చేశారన్నారు. ఆలస్యమైనా.. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, దీంతో ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేయాలన్నారు. ఇక సంక్రాంతి లోపల వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామన్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వీఆర్వోలలో వెనక్కి వచ్చే వాళ్లను మళ్లీ తిరిగి తిసుకుంటామన్నారు. తప్పు చేసిన అధికారులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అసెంబ్లీలోనే ఆర్‌వోఆర్ చట్టం అమలు చేస్తామన్నారు. చట్టం వచ్చిన తర్వాత మేడ్చల్, రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను ఆధారాలతో బయట పెడతామన్నారు. 1971లో ఉన్న మంచిని తీసుకుంటామన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. ఆర్‌వోఆర్ చట్టంపై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఆయన లాగా 80 వేల పుస్తకాలను తాను, సీఎం, ఇతర క్యాబినేట్ మంత్రులెవ్వరూ చదవలేదన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ అనుభవంతో సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. కేటీఆర్, హరీష్ రావు కనీసం 5 వేల పుస్తకాలు చదివినా, వాళ్ళ సూచనలు తీసుకునే వాళ్ళమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచనలు చేయలేదన్నారు. ధర్నా చౌక్‌ను ఓపెన్ చేశామని, ఎవరినీ తాము అడ్డుకోలేదన్నారు. రైతులకు బేడీలు వేయడం సరికాదని, ఇప్పటికే తమ సీఎం ఈ ఘటనపై స్పందించారన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌కు కారణమన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకనే అసెంబ్లీకి రాకుండా పారి పోయారన్నారు. అదానీ విషయంలో వివాదం కావొద్దనే స్కిల్ యూనివర్శిటీకి ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి పంపామన్నారు. 40 శాతం డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో 14 వ తారీఖున అందరు మంత్రులు,అధికారులు భోజనం చేయాలన్నారు. 2 సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులు 31 లోపు విడుదల చేస్తామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి బయ్యారం ఉక్కు కర్మాగారం అంటూ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటున్నారన్నారు.