Allu Arjun: ఇదే నా దేశం గొప్పతనం.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-12 16:22:07.0  )
Allu Arjun: ఇదే నా దేశం గొప్పతనం.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), దర్శకుడు సుకుమార్‌(Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2 ది రూల్‌(Pushpa-2 Movie) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం కలెక్షన్లలోనూ సత్తా చూపిస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే రూ.వెయ్యి కోట్లకుపైగా కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఈ చిత్రబృందం ‘థాంక్యూ ఇండియా’ ప్రెస్‌మీట్‌‌ గురువారం ఢిల్లీలో జరిగింది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు నా థాంక్స్‌. ఈ సినిమాను అందరూ ఆదరిస్తున్నారు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ. ఒక సినిమాను అన్ని రాష్ట్రాల ప్రజలు సెలబ్రేట్‌ చేశాయి. ఇదే నా దేశం గొప్పతనం’ అని అల్లు అర్జున్ అన్నారు. కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటించింది. సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేశ్, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించారు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఐటమ్ సాంగ్‌లో మెరిసింది.

Read More...

Allu Arjun political entry: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? ఐకాన్ స్టార్ టీమ్ స్పందన ఇదే


Advertisement

Next Story