- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైకల్యం విజయానికి అవరోధం కాదు : తెలంగాణ గవర్నర్
దిశ, బేగంపేట : వైకల్యం విజయానికి అవరోధం కాదని నిరూపించారని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. గురువారం బేగంపేటలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్ 'ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ'లో ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న హై పెర్ఫార్మెన్స్ అకాడమీని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఎబిలిటీ గేమ్స్ 2024లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాలపై సంకల్ప బలం సాధించిన విజయం అన్నారు. ఈ క్రీడాకారులు అసమానతలను ధిక్కరించారన్నారు. అవిశ్రాంతంగా శిక్షణ పొంది, ఆ సాధారణ మైలురాళ్లను సాధించారన్నారు. ఇది సంకల్పంతోనే సాధ్యమైందన్నారు. వీరి ప్రయాణం స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ అకాడమీలో సౌకర్యాలు నిజంగా ప్రపంచ స్థాయిలో ఉన్నాయన్నారు. క్రీడాకారులను శక్తివంతం చేయడంలో ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిబద్ధత తిరుగులేనిదన్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఒక వేదిక మాత్రమే కాదని, కలలను సాకారం చేసే కేంద్రం అన్నారు.
ఆదిత్య మెహతా ఫౌండేషన్ ట్రస్టీ, ఎలికో లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వనిత దాట్ల మాట్లాడుతూ… ఆసియా ఖండంలో మొదటిసారిగా స్థాపించబడిన లాభాపేక్షలేని ధార్మిక సంస్థ ఇదన్నారు. ఇది క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎనిమిది వేల మందికి పైగా మెంటర్‌షిప్, స్క్రీనింగ్, శిక్షణ అందించామని తెలిపారు. ప్రాథమిక స్థాయి ప్రతిభను అంతర్జాతీయ చాంపియన్లుగా మార్చామన్నారు. 300 అంతర్జాతీయ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించామన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల వంటి సంస్థలతో కలిసి పని చేయడం గర్వంగా ఉందన్నారు. పారా ఒలింపిక్స్ 2028, యూత్ ఆసియన్ గేమ్స్‌లో భారతదేశానికి గౌరవాన్ని తీసుకురావడం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్, జవహర్ నవోదయ విద్యాలయ దక్షిణ విభాగ ఉప కమిషనర్ టి గోపాలకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.