- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CNG MLA: కేసీఆర్‌ను నమ్మి ఆయన సర్వం కోల్పోయిండు
దిశ, తెలంగాణ బ్యూరో: జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఉద్యమకాలంలో కేసీఆర్‌ను నమ్ముకొని సర్వం కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చాలా మంది ఉద్యమకారులు కేసీఆర్ వల్ల చాలా నష్టపోయారన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు చాలా ద్రోహం చేశారని అన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారెవరూ నష్టపోరని.. నాయకులు, ప్రజలు అందరినీ కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటుందని తెలిపారు. గద్దర్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావు, చాకలి ఐలమ్మతో పాటు తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందన్నారు. కానీ అలాంటి వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందన్నారు.
ఇక సన్న వడ్లు పండించిన రైతులకు ఒక ఎకరానికి రూ.15 వేల రూపాయలు బోనస్ ఇచ్చిందన్నారు. మద్దతు ధర, బోనస్‌తో రైతులకు మేలు జరిగిందన్నారు. కాళేశ్వరంతోనే కేసీఆర్ కథ ముగిసిందన్నారు. లగచర్లలో భూమి కోల్పోతున్న రైతులకు మంచి పరిహారం అందజేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ద్రోహం చేసింది హరీష్‌రావు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అండ్ ఫ్యామిలీ సోనియాను ఎందుకు కలిశారో? ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉన్నదని ఆయన కోరారు.