- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth: కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్ట్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు(Kendriya Vidhyalayas) కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కాంగ్రెస్ ఎంపీలతో కలిసి వరసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యలు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav), సురేష్ షట్కర్(Suresh Shatkar), బలరాంనాయక్(Balaram nayak), చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy), గడ్డం వంశీ కృష్ణ(Gaddam vamshi krishna), రఘురాం రెడ్డి(Raghu Ram Reddy), న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి(AP Jithendar Reddy) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు(Navodaya Vidhayalayas) కేటాయించినందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు(Thank You) తెలిపుతూ శాలువాతో సత్కరించారు. అంతేగాక రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదని, కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను(Deemed University) గుర్తిస్తున్న విషయాన్ని సీఎం, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధిగా ఎన్ఓసీ తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి విన్నవించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రమంత్రికి పలు ప్రతిపాధనలు చేసినట్లు తెలుస్తోంది.