- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్..
దిశ ప్రతినిధి వికారాబాద్ : విద్యార్థులకు విద్యా బుద్ధులు బోధించాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన ధారూర్ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ధారూర్ స్టేషన్ ప్రాథమికోన్నత పాఠశాలలో కిష్టయ్య అనే ఉపాద్యాయుడు సమాజం తలదించుకునేలా అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థినీల తల్లిదండ్రులు గురువారం మండల ఎంఈఓ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాల విధ్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాద్యాయుడు కిష్టయ్య, అమ్మాయిల శరీర భాగాలను టచ్ చేసి వారిని ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదురు ఉపాధ్యాయుడిని నిలదీసేందుకు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. అక్కడ ఉపాధ్యాయుడు లేకపోవడంతో పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోగా ఆయన సెలవుపై వెళ్లాడని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడగా వారు కళ్ళు చెదిరే విషయాలు బయటపెట్టారు.
కిష్టయ్య సార్ తరగతి గదిలో మొబైల్ ఫోన్ లో ఐటం పాటలు పెడుతూ విద్యార్థినీలతో అసభ్యకరంగా శరీర భాగాలపై టచ్ చేసి వారిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడని తెలిపారు. నిజం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అతనిని వెంటనే సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కిష్టయ్యను పాఠశాలకు రప్పించాలని విద్యార్థినిల తల్లిదండ్రులు గొడవకు దిగారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మండల ఎంఈఓ, పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. ఈ విషయాన్ని డిఈఓ రేణుక దేవి దృష్టికి తీసుకువెళ్లి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉపాద్యాయుడు కిష్టయ్యపై గతంలోనూ వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలం, అర్కతల ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఆరోపణలే ఉన్నాయని, పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినికి నీలి చిత్రాలు చూపించాడనే కేసులో ఆయనకు జైలు శిక్షతో పడటమే కాక, సస్పెండ్ కూడా అయ్యాడని తెలుస్తోంది.