Lagacharla Former Incident : లగచర్ల రైతు చేతికి బేడీలు ఘటన... విచారణ చేపట్టిన ఐజీ

by M.Rajitha |
Lagacharla Former Incident : లగచర్ల రైతు చేతికి బేడీలు ఘటన... విచారణ చేపట్టిన ఐజీ
X

దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla) రైతు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తరలించిన ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేయగా.. పోలీస్ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ(Multizone IG Satyanarayana) స్వయంగా సంగారెడ్డి జైలుకు వెళ్లారు. ఉదయం అక్కడ జరిగిన పరిస్థితులపై.. జైల్లో వాతావరణంపై ఐజీ వివరాలు సేకరిస్తున్నారు. శుక్రవారం తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి పంపే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన(Lagacharla Issue)లో అరెస్టయిన రైతులు ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగా వీరిలో హీర్యానాయక్(HeeryaNayak)కు ఈరోజు గుండెపోటు రాగా ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి(Panjagutta NIMS Hospital)కి తరలించారు. అయితే ఈ తరలించే క్రమంలో రైతు చేతికి బేడీలు వేసి తీసుకు వెళ్ళడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే హీర్యానాయక్ కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిమ్స్ వైద్యులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయగా.. రైతుకు ఎమర్జెన్సీ విభాగంలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed