Congress: కేటీఆర్ రాసింది రాతలు కాదు, రోతలు.. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

by Ramesh Goud |   ( Updated:2024-12-12 16:43:51.0  )
Congress: కేటీఆర్ రాసింది రాతలు కాదు, రోతలు.. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1400 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో? చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ స్థాయిలో ఏ పార్టీకీ లేవన్నారు. పదేళ్ల పాటు అక్రమాలకు పాల్పడి అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకావట్లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే పేటీఎం రైటర్లు రాసిన లేఖలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..మతిలేని మాటలతో రాహుల్ గాంధీ కి కేటీఆర్ లేఖ రాశారన్నారు. 18 గంటల పాటు పని చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అక్కసు తోనే కేటీఆర్ లేఖ రాశాడన్నారు. ప్రజా పాలన లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండటం చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.

కేటీఆర్ రాసింది రోతలని విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాల ద్వారా కోటీశ్వరులను చేస్తున్నంకు కేటీఆర్ ఏడుస్తున్నాడన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్ వంటి స్కీమ్ లు అందజేస్తున్నందుకు కేటీఆర్ ఆందోళతో ఉన్నారన్నారు. కిరీటాలు, వడ్డాణాలు, నగలు పెట్టి తెలంగాణ తల్లిని మార్చింది బీఆర్ ఎస్ పార్టీ కాదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ను పదేళ్ల పాటు అడ్డంగా దోచుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టాలన్న సోయి ఎందుకు లేకపోయిందని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ప్రతి ఒక్కరు తమ ఆడబిడ్డలా ఉన్నదని సంతోష పడుతున్నారన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారన్నారు.

Advertisement

Next Story