Hyderabad: 31 వేడుకలు ప్రశాంతంగా జరగాలి.. హైదారాబాద్ పోలీస్ కమీషనర్

by Ramesh Goud |
Hyderabad: 31 వేడుకలు ప్రశాంతంగా జరగాలి.. హైదారాబాద్ పోలీస్ కమీషనర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి 3 స్టార్ హోటల్‌లు, క్లబ్‌లు బార్‌లు, రెస్టారెంట్‌లు, పబ్‌ల నిర్వహణలకు కమీషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ కార్యాలయం నుండి మార్గదర్శకాలను జారీ చేస్తూ గురువారం పత్రిక ప్రకటన చేశారు. డిసెంబర్ 31 నైట్ ఈవెంట్‌లు నిర్వహించబోయే రెస్టారెంట్‌లు, పబ్‌లు కనీసం 15 రోజుల ముందు అనుమతి మంజూరు కోసం పోలీస్ కమిషనర్, హైదరాబాద్‌కి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ అమలు చట్టం, 2013 ప్రకారం, సీసీకెమెరాల పర్యవేక్షణలో కార్యక్రమాల నిర్వహణ జరగాలని సూచించారు.సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం అవుట్‌డోర్‌లోని సౌండ్ సిస్టమ్ (పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లౌడ్ స్పీకర్, డిజే సిస్టమ్, డిజే సౌండ్ మిక్సర్, సౌండ్ యాంప్లిఫైయర్, ఇతర హై సౌండ్ జనరేటింగ్ ఎక్విప్‌మెంట్‌తో సహా) తప్పనిసరిగా రాత్రి 10గంటలకు నిలిపివేయాలని ఆదేశించారు.

ఈవెంట్ పాసులు,టికెట్లు , కూపన్‌లు సామర్థ్యానికి మించి మంజూరు చేయరాదని నిర్వాహకులు నిర్ధారించుకోవాలని పేర్కోన్నారు. శాంతిభద్రతల సమస్యకు దారితీయకుండా కార్యక్రమాల నిర్వహణ జరగాలని సూచించారు. బాణసంచా కాల్చడం లేదా వాటిని ఉపయోగించడం వంటివి చేయకూడదని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో యూ/ఎస్ 185 మోటార్ వాహనాల చట్టం ప్రకారం నిబంధనల మేర కేసులు నమోదు చేయాబడతాయని తెలిపారు. కస్టమర్లు తమ వాహనాలను ఓవర్ స్పీడ్‌లో నడపడం, ప్రమాదకరమైన డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో రేసింగ్ చేయడం వంటివి నిషేందిచినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిచిన వారి పై మోటార్ వెహికల్ యాక్ట్ లోని సెక్షన్ 183, 184 ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కోన్నారు. షీ టీమ్స్ ప్రతిచోటా ఏర్పాటు జరుగుతుది , కాబట్టి ఎవరైనా మహిళలపై నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

Advertisement

Next Story