CM Chandrababu Nayudu : విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తాం : చంద్రబాబు

by M.Rajitha |
CM Chandrababu Nayudu : విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తాం : చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : నాలెడ్జి సొసైటీ మన ప్రభుత్వ లక్ష్యం... ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు(CM Chandrababu Nayudu) అధికారులను కోరారు. గురువారం మానవవనరులశాఖపై సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలన్నారు. ప్రైవేటు విద్యావ్యవస్థను తొక్కేయడం మన విధానం కాదని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయం అన్నారు. రాబోయే రోజుల్లో నాలెడ్జి ఎకానమీ(Knowledge Econamy)లో తెలుగు విద్యార్థులు నెం.1గా నిలవాలని, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పేరెన్నిగన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రత్యేక బృందాలను పంపి అక్కడ బోధన, అభ్యసన పద్ధతులపై అధ్యయనం చేయాలని తెలిపారు. తదనుగుణంగా కరిక్యులమ్ లో మార్పులు చేసి, ఎన్ఐఆర్ఎఫ్, గ్లోబల్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని సూచించారు.

సివిల్ యావియేషన్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం రంగాల్లో భవిష్యత్ అవకాశాలను అంచనావేసి ఆయా యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. స్కిల్స్, ఎంప్లాయ్ మెంట్ ను బ్యాలెన్స్ చేయాల్సి ఉందని.. ఇందుకోసం అమరావతి రాజధానిలో ఏర్పాటుచేసే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో రాష్ట్రంలోని 5 జోన్లలోని స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలను అనుసంధానిస్తామన్నారు. డిజిటల్ టీచింగ్, లెర్నింగ్ పై దృష్టిసారించాలని తెలిపిన సీఎం.. సొసైటీ అవసరాలను బట్టి స్కిల్ అప్ గ్రేడేషన్ చేపట్టాలని, ఒకేషనల్ విద్యపై దృష్టిసారించాలన్నారు. పాఠశాలల్లో రేటింగ్ మెరుగుదలకు కలెక్టివ్ టీమ్ బిల్డింగ్ తో ర్యాంక్సింగ్స్ మెరుగుదలకు కృషిచేసి, విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులంతా కృషిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story