- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: ట్రోఫీ ఇక్కడ జరగడం సంతోషం.. పోస్టర్ ఆవిష్కరణలో సీఎం
దిశ, వెబ్ డెస్క్: హైద్రాబాద్(Hyderabad) లో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ(Santosh Trophy) పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఫుట్‌బాల్ ఆటలో ప్రతిష్టాత్మకంగా జరిగే సంతోష్ ట్రోఫీకి ఈ సంవత్సరం హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ట్రోఫీ డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ నగరంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సంతోష్ ట్రోఫీ పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి(Shivasena Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్(MP Anil Kumar Yadav), డాక్టర్ మల్లు రవి(Mallu Ravi), చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy), బలరాం నాయక్(Balaram Nayak), రఘురాం రెడ్డి(Raghuram Reddy), జీ వంశీ కృష్ణ(Vamshi Krishna), రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి(Jithendar Reddy), ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి(Rohin Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరం చారిత్రాత్మకమైన ఫుట్ బాల్ క్రీడా ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 31 వరకు దాదాపు 37 వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొంటున్న ఈ సంతోష్ ట్రోఫీ కి సంబంధించి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శివసేనారెడ్డి తెలిపారు.