- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) సోషల్ మీడియా(Social Media)లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేడు(గురువారం) రెండో రోజు కలెక్టర్ల సదస్సు(Collector Conference)లో సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా పోస్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులతో ఇబ్బందులకు గురిచేసిన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ పై సీఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ‘కొందరు నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు. వీటిపై నియంత్రణకు ఓ కమిటీని నియమించాలి. మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, అనిత, సత్యకుమార్ యాదవ్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేలా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.