మహిళల భద్రత షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

by Naveena |
మహిళల భద్రత షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహిళల సంరక్షణ,భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం అని మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక న్యూ టవున్ లోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో గురువారం సాయంత్రం షీ టీమ్స్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భరోసా సెంటర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక సేవా కేంద్రమని,ఇది మహిళలు,పిల్లలు,కుటుంబ హింస,బాధితుల మద్దతు,న్యాయం పొందడానికి సహాయపడుతు,బాధితులకు ఒకే చోట అన్ని సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మహిళలు,విద్యార్థినీలు ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా వేధింపులు,అక్రమ రవాణా,బాల్య వివాహాలు లాంటి వాటిని,అలాగే బాల్య కార్మికులు,బోండెడ్ లేబర్,ఫోక్సో చట్టం,పని వేధింపులు,మహిళల ను మంచి,చెడు టచ్చెస్,యాంటి ర్యాగింగ్,సెల్ఫ్ డిఫెన్స్,సైబర్ క్రైమ్ లాంటి వాటికి షీ టీమ్స్ ఎల్లప్పుడూ సహాయం చేస్తుందని ఆయన వివరించారు. అత్యవసర సమయాల్లో మహిళలు,అమ్మాయిలు ఇబ్బందులకు గురైతే 100 కు కానీ..షీ టీమ్ ఫోన్ నెంబర్ 8712659365 కు డయల్ చేయాలని, బాధితుల ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక పోలీస్ విభాగం భరోసా సెంటర్ ఫోన్ నెంబర్ 8712659280 కు కాల్ చేయవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టూ టవున్ సీఐ ఏజాజోద్దీన్,భరోసా సెంటర్ ఇంచార్జీ ఎస్ఐ సుజాత,షీ టీం సభ్యులు,ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed