నడిరోడ్డుపై ఆగిపోయిన ఆర్టీసీ బస్సు..అసలేం జరిగిందంటే..?

by Naveena |
నడిరోడ్డుపై ఆగిపోయిన ఆర్టీసీ బస్సు..అసలేం జరిగిందంటే..?
X

దిశ, భిక్కనూరు : హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డీజిల్ అయిపోవడంతో రోడ్డుపై ఆగిపోయిన సంఘటన గురువారం భిక్కనూరులోని టోల్ ప్లాజా వద్ద నున్న హైవేపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బోధన్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బోధన్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని హైదరాబాద్ కు బయలుదేరింది. డీజిల్ చూసుకోకుండా బయలుదేరారేమో కానీ..టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే సడన్ గా బస్సు ఆగిపోయింది. దీంతో బస్సులో కూర్చున్న ప్రయాణికులు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సడన్ గా బస్సు ఎందుకు ఆగిపోయిందని ప్రయాణికులు డ్రైవర్ ను అడగగా..డీజిల్ అయిపోయిందని చెప్పాడు. డీజిల్ చూసుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నావా అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మనసులో పెట్టుకున్న డ్రైవర్ ఉల్టా పల్టా సమాధానాలు చెబుతూ..ప్రయాణికులపై చిరు బుర్రులాడారు. అరగంట తర్వాత డ్రైవర్, బస్సు యజమానికి ఈ విషయం చెప్పగా..డ్రైవర్ నెంబర్ కు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిణీ చేశాడు. జిఎంఆర్ సిబ్బంది ఆ డబ్బులను తీసుకొని తమ వాహనంలో డీజిల్ తీసుకువచ్చి ఇచ్చారు. దీంతో తెచ్చిన డీజిల్ ను పోయడంతో సుమారు గంట తర్వాత బస్సు బయలుదేరింది.

Advertisement

Next Story