రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి..

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి..
X

దిశ,నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కల్లేరు మండలం కిష్టాపూర్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కల్హేర్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వల్లూరు తండాకు చెందిన విస్లావత్ సంగ్య నాయక్(60), విస్లావత్ సంఘీభాయ్ (55) నారాయణఖేడ్ నుంచి బైక్ పైన వల్లూరు తండాకు వెళ్తుండగా కిష్టాపూర్ లోని పల్లె చెరువు వద్ద జీప్ వేగంగా వచ్చి ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా మృతి చెందిన వారు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గ్రామం మల్లూరు తండా వాసులుగా గుర్తించారు. వీరికి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉంది. భార్యాభర్తలు యాక్సిడెంట్లు మృతించడంతో ఒక్కసారిగా తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed