Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ చేంజర్’ నుంచి క్రేజీ న్యూస్ లీక్?

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-12 16:30:44.0  )
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ చేంజర్’ నుంచి క్రేజీ న్యూస్ లీక్?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం గేమ్ చేంజర్(Game Changer). షూటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి(Sankranti) కానుకగా విడుదల చేసేందుకు మేకర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ మెగా అభిమాని గేమ్ చేంజర్ చిత్రబృందంలోని కీలక వ్యక్తికి వాట్సాప్‌లో మెసేజ్ చేశారు.

‘అన్న గేమ్ చేంజర్ ఎలా ఉండబోతోంది. నాకు ఫుల్ టెన్షన్‌గా ఉంది. ఎవరెవరో ఏదేదో చెబుతున్నారు. ప్లీజ్ అన్న కొంచెం చెప్పు’ అని వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. దానికి గేమ్ చేంజర్‌ మూవీ టీమ్‌లోని వ్యక్తి స్పందించారు. ‘పోతారు మొత్తం పోతారు. రామ్ చరణ్ కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నువ్వు కూడా హ్యాపీగా ఉండు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఇండియన్ సినిమా చరిత్రలోనే కొత్తగా ఉంటుంది’ అని రిప్లై ఇచ్చారు. ఈ వాట్సాప్ చాటింగ్‌ను స్క్రీన్ షార్ట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed