Jamili Election : జమిలి ఎన్నికలపై కేటీఆర్ రియాక్షన్ ఇదే!

by M.Rajitha |
Jamili Election : జమిలి ఎన్నికలపై కేటీఆర్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకేసారి లోక్‌స‌భ‌(Loksabha), అసెంబ్లీ ఎన్నిక‌ల‌(Assembly Election)ను నిర్వహించేందుకు.. వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్షన్ బిల్లు(One Nation One Election Bill)ను కేంద్ర స‌ర్కారు తీసుకువ‌స్తోంది. అయితే ఆ ప్రతిపాద‌న‌కు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల స‌మావేశాల్లోనే ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ‌పెట్టనున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌మిలి ఎన్నిక‌ల ప్రతిపాద‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని 2017లోనే ప్రతిపాద‌న చేశార‌ని, ఆ స‌మ‌యంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi).. అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వహించార‌ని, ఆ మీటింగ్‌కు హాజ‌రై ఆ ప్రతిపాద‌న‌కు మ‌ద్దతు ఇచ్చిన‌ట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఏడేళ్ల త‌ర్వాత జమిలి ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం ద‌క్కిన‌ట్లు మీడియా ద్వారా తెలుసుకున్నానని.. అయితే ఆ బిల్లు ఏ రూపంలో ఉంద‌న్న అంశంపై క్లారిటీ లేద‌ని కేటీఆర్ తెలిపారు. బిల్లుపై స‌మ‌గ్ర విశ్లేష‌ణ చేయాల్సి ఉంటుందని, ప్రాంతీయ పార్టీల గురించి బిల్లులో ఎటువంటి అంశాల‌ను పొందుపరిచారో తెలుసుకోవాల‌ని అన్నారు. త‌మ పార్టీలో దీనిపై చ‌ర్చ జ‌రిగిన త‌ర్వాతే తుది నిర్ణయం వెల్లడిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed