- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dharani: నాలుగు రోజులు ధరణి బంద్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు బంద్ కానున్నాయి. డేటా బేస్ వెర్షన్ అప్ గ్రేడ్ కార్యక్రమం నేపధ్యంలో నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అప్ గ్రెడేషన్ స్టార్ట్ కానున్నది. సోమవారం అంటే 16వ తేదీ వరకు నడుస్తుంది. ఈ మధ్య కాలంలో ధరణి పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవు. మూడు రోజుల నుంచి సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. బుధవారం నుంచే ధరణి ఓటీపీలు కూడా రావడం లేదని మీ సేవా నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు రెండు రోజులు ధరణి పోర్టల్ ద్వారా ఓన్లీ సేల్ డీడ్ మాత్రమే అయ్యాయి. టీఎం 33, గిఫ్ట్ డీడ్స్ వంటి మాడ్యూల్స్ పని చేయలేదు. మధ్య మధ్యలో సైట్ లోడింగ్ అని చూపించింది.
టెర్రాసిస్ సృష్టించిన సాఫ్ట్ వేర్, పోర్టల్ ని యథాతథంగా వాడడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నది. అధికారంలోకి రాగానే ఆ పని చేసేస్తాం అన్నారు. పైగా ధరణి పోర్టల్ 35 మాడ్యూళ్లతో గందరగోళం నెలకొన్నది. దీన్ని సరళీకృతం చేసే పనిని ఎంతగా చేపట్టినా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సమాచారం. తక్కువ మాడ్యూల్స్ తోనే రైతులకు సేవలందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ సమస్య ఉన్నా ఒక్క మాడ్యూల్ కిందనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును తీసుకురానున్నారు. ఐతే టెర్రాసిస్ రూపొందించిన సాఫ్ట్ వేర్ తో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ధరణి పోర్టల్ నిర్వహణను చేపట్టిన ఎన్ఐసీకి కూడా తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.