సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలి

by Kalyani |
సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలి
X

దిశ, హిమాయత్‌నగర్‌ : వర్తమానంలో జీవించడం, సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకోవడం, ధైర్యం, సమగ్రతకు ఉదాహరణగా నిలవాలని విద్యార్థులకు ఆర్మీ మేజర్ జనరల్ రాజేష్ కుంద్రా సూచించారు. గురువారం ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ 44వ వార్షిక క్రీడా దినోత్సవం స్కూల్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మీ మేజర్ జనరల్ రాజేష్ కుంద్రా, స్కూల్ డైరెక్టర్ మణికొండ ప్రార్థనతో కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జ్యోతిని వెలిగించి, అనంతరం క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. సీబీఎస్ఈ విద్యార్థులచే 'నమో నమో నమో శంకర' నృత్యం, ఎస్ఎస్సీ విద్యార్థులచే యోగా, కరాటే ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఓయూ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ, డీన్ సీనియర్ ప్రో.రాజేష్ కుమార్, సీబీఐటీ మాజీ ప్రిన్సిపాల్, డైరెక్టర్ డా.ఐ.రామచంద్రారెడ్డి, మేనేజర్ మైఖేల్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed