- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు చేయాలి
దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలం నారాయణపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పట్టా భూమిలేని రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. పట్టా భూమి కలిగిన రైతులు పండించిన వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో ఆగ్రహించిన నారాయణపురంనకు చెందిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట ఆర్అండ్ బీ రోడ్డుపై బైఠాయించి పట్టా లేని రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేశారు. ఏజెన్సీ ఏరియా కావడంతో దాదాపు 80 శాతం రైతుల భూములకు పట్టాలు లేవని వాపోయారు. పట్టా ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎటువంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
స్పందించిన ఎమ్మెల్యే జారె
అసెంబ్లీ సమావేశాల నిమిత్తం హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రైతుల ధర్నా విషయం తెలుసుకొని స్పందించారు. ధాన్యం కొనుగోలులో తలెత్తిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ నారాయణపురం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో చర్చించారు. పట్టా లేకపోయినప్పటికీ ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన ఏదైనా ఆధారంతో ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.