- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ 31 పార్టీల్లో...డ్రగ్స్ మాట వినబడితే టీజీ న్యాబ్ ప్రత్యక్షం
దిశ, సిటీ క్రైమ్ : 20 వేల మంది పై టీజీ న్యాబ్ అధికారులు నిఘా పెట్టారు. న్యూ ఈయర్ వేడుకల్లో మాదకద్రవ్యాల ఊసే ఉండకుండా చేసేందుకు నార్కోటిక్ అధికారులు వారి బృందాలతో ప్రత్యేక సెర్చ్ అపరేషన్ లను మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో టీజీ న్యాబ్ ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులతో పాటు గత ఐదు సంవత్సరాల కిందట నమోదైన మాదకద్రవ్యాల సరఫరా కేసులలో అరెస్టైన వారి రికార్డులను కూడా పరిశీలిస్తుంది. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుని సేవించి దొరికి పోయిన వారి చిట్టా ను కూడా టీజీ న్యాబ్ జల్లెడ పడుతుంది. ఈ దందా చేసే వారితో ఆర్థిక లావాదేవీల సంబంధాలు ఉన్న వారందరికీ లిస్టును రెడీ చేసుకున్నారు. ఇలా టీజీ న్యాబ్ దగ్గర దాదాపు 20 వేల మందికి పై డాటా రెడీగా ఉంది. ఈ 20 వేల మందిని టీజీ న్యాబ్ అధికారులు నిరంతరం ఫాలో అవుతున్నారు.
డ్రగ్స్ సంబంధించిన హాట్ స్పాట్స్ లలో ఈ అనుమానితులు అడుగుపెడితే చాలు టీజీ న్యాబ్ అధికారులకు అలర్ట్ వచ్చేలా ఓ ప్రక్రియను అభివృద్ధి చేసుకున్నారు. ఈ ప్రణాళికతో టీజీ న్యాబ్ అధికారులు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తెలంగాణ తో పాటు హైదరాబాద్ కు మాదకద్రవ్యాలు రానివ్వకుండా పూర్తిగా అడ్డుకట్ట వేస్తున్నారు. కొత్త సంవత్సరం స్వాగత వేడుకల్లో హైదరాబాద్ లో ఈ మాదకద్రవ్యాలకు భారీ డిమాండ్ ఉంటుందనే కోణంలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి తదితర రాష్ట్రాల్లోని అక్రమ డ్రగ్స్ మాఫియా వీటి సప్లై కి అనేక రహస్య మార్గాల కోసం అన్వేషిస్తున్నారని టీజీ న్యాబ్ అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన టీజీ న్యాబ్ అధికారులు వారి అపరేషన్ ను ప్రారంభించి గంజాయి, డ్రగ్స్ కేసులలో అనుమానితులుగా ఉన్న వారందరీని సీక్రెట్ గా వెంటాడుతున్నారు.
నగరంలో నైజీరియన్ దేశానికి చెందిన వారు ఉండే టోలీచౌకి, సైనిక్ పురి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కూడా టీజీ న్యాబ్ అధికారులు నజర్ పెంచారు. ఆ దేశానికి చెందిన వారు ఇది వరకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డ వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. వారు అరెస్టు సమయంలో ఇచ్చిన చిరునామాలో ఉంటున్నారా లేదా మరో చోటకి మకాం మార్చారా అని ఆరా తీస్తున్నారు. మాదకద్రవ్యాల సరఫరా బెడద తీవ్రంగా ఉండే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లపై కూడా టీజీ న్యాబ్ అధికారులు దృష్టి పెట్టారు. ఆన్ లైన్ వేదికలతో పాటు డార్క్ వెబ్ పై కూడా టీజీ న్యాబ్ అధికారులు సాంకేతిక టూల్స్ తో డ్రగ్స్ మాఫియా దందా పై ఫోకస్ పెట్టారు.
మరోవైపు రాష్ట్రంలో ని పోలీసు, ఎక్సైజ్ , ఇతర ప్రభుత్వ ఏజెన్సీల అధికారులను , ఇతర రాష్ట్రలు, కేంద్ర నార్కోటిక్ బ్యూరో ఏజెన్సీలతో కూడా సమన్వయం చేసుకుంటూ టీజీ న్యాబ్ అధికారులు డ్రగ్స్ , గంజాయి స్మగ్లర్ ల పై డేగ కన్ను పెట్టారు. కొత్త సంవత్సరం స్వాగత వేడుకల్లో ఎవరు కూడా ఈ మాదకద్రవ్యాల మోజులో వాటి జోలికి పోవద్దని, పోలీసులకు దొరికితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని టీజీన్యాబ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. పౌరులు కూడా ఈ డ్రగ్స్ దందా పై సమాచారం ఉంటే డయల్ 100 కు ఫోన్ చేయాలని పోలీసులు అధికారులు కోరుతున్నారు.