- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-2 పరీక్షలను సజావుగా నిర్వహించాలి
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు 49 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోదాడ రీజినల్ పరిధిలో 19, సూర్యాపేట రీజినల్ లో 30 పరీక్ష కేంద్రాలలో మొత్తం 16857 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్ లు, శాఖపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలను తీసుకువెళ్లేందుకు బందోబస్తు, ఎస్కార్ట్ల తో తీసుకెళ్లేందుకు ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 Bnss సెక్షన్ విదించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గ్రూప్ 2, పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయం రాకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.