T BJP: ఇదేనా కాంగ్రెస్ కు తెలిసిన నీతి..? తెలంగాణ బీజేపీ సంచలన ట్వీట్

by Ramesh Goud |
T BJP: ఇదేనా కాంగ్రెస్ కు తెలిసిన నీతి..? తెలంగాణ బీజేపీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ విధానం(Congress Policy) హిందువులకు వ్యతిరేకం అని బీజేపీ తెలంగాణ(BJP Telangana) ట్వీట్ చేసింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరోకరు ట్వీట్లతో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ సంచలన ట్వీట్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పై మండిపడింది. ఈ సందర్భంగా.. సెక్యులర్ ముసుగులో హిందూ ధర్మంపై ఉన్మాదం అని వ్యాఖ్యానించింది. అంతేగాక బతుకమ్మ పండుగపై చిల్లర మాటలు, రామ మందిర ప్రారంభోత్సవంపై వెధవ కూతలు, దేవాలయాలు నిర్మస్తే బిక్షగాళ్లు పెరుగుతారన్న ప్రబుద్దులు, సాధువులపై సంస్కారం లేని పరుషవ్యాఖ్యలు, సనాతన ధర్మంపై పిచ్చి ప్రేలాపనలు అని విమర్శల వర్షం కురిపించింది. దీనిపై హిందూ ధర్మంపై దాడి చేయడం.. హిందూ మత ఆచార, సంప్రదాయాలపై కట్టుకథలు, ఉన్మాద వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే కాంగ్రెస్‌కు తెలిసిన నీతా? అని బీజేపీ(BJP) రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed