- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య
దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా మండల కేంద్రంలోని వన్నారం గ్రామానికి చెందిన బనుక రవి (46) కరీంనగర్ ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వన్నారం గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి విషయంలో బనుక రవికి అన్నదమ్ములతో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఇదే విషయమై గొడవలు జరుగుతుండడంతో వారి వేధింపులు భరించలేక నాలుగు రోజుల క్రితం (9వ తేదీన) రవి గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల సహాయంతో దవాఖానాల్లో చేర్పించారు. పరిస్థితి విషమించి గురువారం దవాఖానాల్లోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసుల ఫిర్యాదులో భార్య రమ పేర్కొంది. మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.