రాజీ మార్గమే రాజమార్గం

by Sridhar Babu |
రాజీ మార్గమే రాజమార్గం
X

దిశ, ఆదిలాబాద్ : రాజీ మార్గమే రాజ మార్గమని, కక్షిదారులు తమ పెండింగ్ లో ఉన్న కేసులను రాజమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం కోరారు. దేశవ్యాప్తంగా ఈనెల 14న అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా కోర్టులలో సంవత్సరాలపాటుగా పరిష్కరించబడని కేసులు రాజీ పడడం వల్ల తక్షణం పరిష్కరించబడి సమయం, డబ్బులు, వృథా కాకుండా ఉంటాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా చట్టరీత్యా రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులు, సివిల్ తదితర కేసులను ఈ అదాలత్ లో పరిష్కరించుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed