Gukesh : చెన్నై నుంచి గ్లోబల్ స్టార్‌డమ్.. గుకేష్ జర్నీ, సాధించిన అచీవ్‌మెంట్స్ ఇవే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-12 15:21:12.0  )
Gukesh : చెన్నై నుంచి గ్లోబల్ స్టార్‌డమ్.. గుకేష్ జర్నీ, సాధించిన అచీవ్‌మెంట్స్ ఇవే..!
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్-2024 విజేతగా నిలిచి గుకేష్ చరిత్ర సృష్టించాడు. డింగ్ లిరెన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి గ్లోబల్ చెస్ కింగ్‌గా అవతరించాడు. ప్రపంచ చెస్ క్రీడా రంగంలో చెన్నైకి చెందిన ఈ 18 ఏళ్ల యువ ఆటగాడు ధృవ తారల దూసుకొచ్చాడు.

బాల్యం, విద్యాభ్యాసం

గుకేష్ 2006 మే 29న చెన్నైలో చదువుకున్న జన్మించాడు. గుకేష్ తండ్రి డాక్టర్ రజినీకాంత్ సర్జన్‌గా స్థిరపడ్డాడు. తల్లి పద్మ మైక్రోబయోలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల ప్రాయంలోనే గుకేష్ చెస్ జర్నీ ప్రారంభం అయింది. వెలమ్మాళ్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న సమయంలో కోచ్ భాస్కర్ గుకేష్‌కు చెస్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించాడు. అనంతరం కుటుంబ సభ్యులు అతని మెంటర్ గుకేష్‌ను ప్రోత్సహించారు. దీంతో అతి తక్కువ సమయంలో ఈ చెస్ ఆటగాడు తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. దీంతో భారతదేశ చరిత్రలో అతి పిన్న వయసులో (కేవలం 12 ఏళ్ల 7 నెలల 17 రోజులకు) గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అనంతరం ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు.

తల్లిదండ్రుల మద్ధతుతో..

గుకేష్ కు చెస్ పట్ల ఉన్న ఆసక్తిని చిన్నప్పుడే గుర్తించిన తల్లిదండ్రులు అతన్ని అడుగడుగునా ప్రోత్సహించారు. గుకేష్‌కు అత్యుత్తమ కోచింగ్, వనరులు, అవకాశాలు అందించేందుకు అనేక త్యాగాలు చేశారు. తల్లిదండ్రుల సహకారంతో గుకేష్ తీవ్రమైన ఒత్తిడి ఉండే చెస్ ఆటలో రాణించేలా చేశాయి.

ఏపీ నుంచి చెన్నైకి..

గుకేష్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు. అయితే వారు తదనంతరం చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిని గుకేష్‌కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు కుర్రాడు 18 ఏళ్లకే చెస్ ఛాంపియన్‌గా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు, ప్రశంసలు పొందాలని ట్వీట్ చేశారు.

ఒలింపియాడ్‌లో రైసింగ్ స్టార్

44వ చెస్ ఒలింపియాడ్‌లో గుకేష్ అద్భుతంగా రాణించి రైసింగ్ స్టార్‌గా ఎదిగాడు. యూఎస్‌కు చెందిన టాప్ సీడ్ ఆటగాడిపై 8/8 చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. గుకేష్ స్థిరంగా రాణించడంతో 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ డబుల్ గోల్డ్ సాధించింది.

గ్రాండ్ మాస్టర్‌గా రికార్డ్

2018లో స్పెయిన్‌లోని గలిసియాలో జరిగిన అండర్-12 వరల్డ్ చాంపియన్ షిప్ విజేతగా గుకేష్ నిలిచాడు. 2022లో వరల్డ్ నెంబర్ 1 చెస్ ఆటగాడు మాగ్నుస్ కార్ల్‌సన్ ఓడించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

మైలురాయిగా.. 2024

ఈ ఏడాది ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీలను ఓడించి క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలుచుకున్న పిన్న వయస్కుడిగా గుకేష్ నిలిచాడు. మెంటర్ విశ్వనాథ్ ఆనంద్‌ను అధిగమించి భారతదేశ నెంబర్ 1 ఆటగాడిగా నిలిచి 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టాడు. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయి గుకేష్ అతి పిన్న వయసులో ఈ టోర్నీలో పోటీ పడుతున్న ఆటగాడిగా నిలిచాడు.

మెంటర్‌గా విశ్వనాథన్ ఆనంద్ ‘కీ’ రోల్

గుకేష్ కెరీర్‌ ఈ స్థాయికి చేరడానికి విశ్వనాథన్ ఆనంద్ కీలక పాత్ర పోషించాడు. వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో భాగంగా మానసిక ధృఢత్వం, చెస్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై అమూల్యమైన శిక్షణ పొందాడు. దీంతో గుకేష్ ప్రపంచ చెస్ క్రీడారంగంలో శిఖరాగ్రానికి చేరుకోవడానికి ఆనంద్ మెంటర్ షిప్ మూలస్తంభంగా నిలిచింది.

గుకేష్ సాదించిన మరికొన్ని విజయాలు

2015లో అండర్-9 చెస్ చాంపియన్ షిప్‌ను గుకేష్ గెలుచుకున్నాడు. దీంతో పాటు 2018లో ఆసియన్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఐదు గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2023లో 2750 ఎఫ్ఐడీఈ రేటింగ్ సాధించి అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా గుకేష్ నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed