రజినీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్పెషల్ బర్త్ డే విషెస్

by Jakkula Mamatha |
రజినీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్పెషల్ బర్త్ డే విషెస్
X

దిశ,వెబ్‌డెస్క్: అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) 74వ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. సినీ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా(X) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్, ఎంతోమందికి తన అడుగే ఒక ఇన్స్పిరేషన్‌గా నిలిచి చిత్రసీమలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సువర్ణ అక్షరాలతో లిఖింపబడేలా కష్టపడిన నటుడు @rajinikanth గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story