- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun political entry: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? ఐకాన్ స్టార్ టీమ్ స్పందన ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ (Allu Arjun's political entry) ఇవ్వబోతున్నారని నెట్టింట చర్చానీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి రావాలనే నేపథ్యంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) తో అల్లు అర్జున్, బన్నీవాసు, ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు భేటీ అయినట్లు టాక్ నడస్తోంది. ప్రశాంత్ కిశోర్ సూచనతో అతి త్వరలో అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.
ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ టీమ్ ఇవాళ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను అల్లు అర్జున్ టీమ్ ఖండించింది. అల్లు పొలిటికల్ ఎంట్రీ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, బేస్‌లెస్ అని తెలిపింది. దయ చేసి మీడియా ఇలాంటి వార్తలను ప్రసారం చేయకూడదని అల్లు అర్జున్ టీమ్ రిక్వెస్ట్ చేసింది.