Ap News:రెండు రోజుల పోలీసు కస్టడీకి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త

by Jakkula Mamatha |
Ap News:రెండు రోజుల పోలీసు కస్టడీకి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి(Varra Ravinder Reddy)ని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కడప కోర్టు(Kadapa Court) ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్(Minister Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హోంమంత్రి అనిత(Home Minister Anitha) పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీందర్ రెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed