VH: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?

by Gantepaka Srikanth |
VH: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: జమిలి ఎన్నికల(One Nation One Election)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ లీడర్, మాజీ మంత్రి వీ.హనుమంత రావు(V. Hanumantha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు సాధ్యమేనా? అని కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది కావాలని అన్నారు. దేశంలో ఒక వైపు రైతులు, నిరుద్యోగులు, మహిళలు అనేక సమస్యలతో బాధపడుతుంటే అవి పట్టించుకోకుండా.. ఎన్నికలపై కేంద్రం ఆలోచించడం దారుణమని అన్నారు.

రైతులకు మద్దతు ధర లేక ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మణిపూర్‌(Manipur)లో ఇంకా హింస కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఇవన్నీ పక్కనబెట్టి జమిలి బిల్లును పార్లమెంట్(Parliament) ముందుకు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.

Advertisement

Next Story